ఇబ్బందులు కలగకుండా చూడాలి


Thu,November 21, 2019 01:18 AM

మంచిర్యాల అగ్రికల్చర్‌: గత ఖరీఫ్‌తో పో ల్చితే రెట్టింపు ధాన్యం వస్తుందని ఎవరికి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని జేసీ నిర్వాహకులను ఆదేశించారు. పౌర సరఫరా టల శా ఖ అధికారులు ప్రతి రోజూ ఏదో ఒక మండ లం, డివిజన్‌లోని కేంద్రాలను
పరిశీలిస్తున్నా రు. అటు రైతులు, ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏజెన్సీ అధికారులు, మిల్లర్లకు, ట్రాన్స్‌ఫోర్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పౌర సరఫరాల శాఖ కలెక్టర్‌, జేసీ సురేందర్‌ రావు జిల్లాలోని జన్నా రం,దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌, జైపూర్‌, చెన్నూర్‌, కోటపల్లి మండలాలను బుధవారం సందర్శించారు. మండలాల్లో ని పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఐకేపీ, మెప్మా కేం ద్రాలకు వెళ్లి ఎంత మంది రైతులు ధాన్యం తెచ్చారు, ఎంత మంది వద్ద కొనుగోలు జరిపారనే విషయాల రిజిష్ర్టార్‌లను తనిఖీ చేశారు. తప్పకుండా రికార్డులు ని ర్వహించాలనీ, రైతుల వద్ద నుంచి ధాన్యం తూ కం వేసిన వెంటనే వారి ధాన్యానికి సంబంధించిన కాగితాలైన పట్టాదారు పాస్‌ పుస్తకం, మ నుగడలో ఉన్న బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ (జీరో ఖాతా కాకుండా), ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను తీ సుకోవాలనీ, కౌలు రైతు అ యితే కౌలు అంగీకార పత్రంపై వీఆర్‌ఓ, ఏఈ ఓ సంతకాలు చే యించిన పత్రాలను తీసుకోవాలన్నారు. ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ ఆరిన నాణ్యమైన ధాన్యా న్ని తీసుకురావాలనీ, ఒక్కో రైతు వారం, పది రోజుల పాటు కేంద్రాల్లోనే ఆరబోస్తే మిగితా రైతులకు ఇబ్బందులు కలుగుతుందని చెప్పా రు. ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. జేసీ వెంట డీసీఎస్‌వో వీ వెంకటేశ్వర్లు, సీఎస్‌సీ డీఎం గెడం గోపాల్‌, డీపీఎం వేణు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రవీందర్‌, డీసీఎంఎస్‌ నుంచి సంతో ష్‌, తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...