క్యాతనపల్లిలో వైద్య శిబిరం


Sat,November 16, 2019 12:38 AM

రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మందమర్రి అర్బన్ ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ జీ వెంకటనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ ప్రతాప్, హెచ్‌ఈఓ నాందేవ్ మాట్లాడారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సీజనల్ వ్యాధులు సోకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పారిశుధ్య, మున్సిపల్ సిబ్బంది తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 62 మంది పారిశుధ్య సిబ్బంది, ఏడుగురు కార్యాలయ సిబ్బంది, 18 మంది మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ కీర్తి నాగరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ అచ్యుత్, టీపీ అండ్ బీఓ రాజ్‌కుమార్, ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతోష్, మెప్మా కోఆర్డినేటర్ కిశోర్, ఏఎన్‌ఎంలు లావణ్య, రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...