ఆరోగ్య భారత్ నిర్మించాలి


Sat,November 16, 2019 12:38 AM

మంచిర్యాల అగ్రికల్చర్: ధూమ, మద్యపానాన్ని నిషేధించి దేశాన్ని ఆరోగ్య భారత్‌గా నిర్మించాలనీ, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ మాస్ మీడియా అధికారి డీవీ రాంనర్స య్య పేర్కొన్నారు. ఐబీ చౌరస్తాలోని వాగ్ధేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పొ గాకు, మద్యంతో కలిగే అనర్థాలను వివ రించారు. చదువుకునే వయసులో ధూ మపానానికి బానిస కావడం వలన నో రు, ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్, మగవారిలో నపుంసకత్వం, ఆడవారిలో పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని కోల్పోవడం, గర్భాశయ క్యాన్సర్, మధుమేహంతో పాటు గుండె వ్యాధులకు గురవుతారన్నారు. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ గణంకాల ప్రకారం మన దేశంలో ఏటా పది లక్షల మంది ధూమ, మద్యపానా నికి సంబంధించిన రోగాలతో మృతి చెం దుతున్నారన్నారు. కళాశాల కరస్పాండెం ట్ పెట్టం మల్లయ్య, డైరెక్టర్లు శ్రీకర్, రాజు, ప్రిన్సిపాల్ మహేందర్, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...