నిరంతరం అప్రమత్తంగా ఉండాలి


Wed,November 13, 2019 02:39 AM

బెల్లంపల్లి రూరల్‌: నిరంతరం అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వర్తించాని డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులతో డీసీపి ఉదయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. బెల్లంపల్లి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ లోని సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్ల లో నమోదవుతున్న నేరాలపై అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారానికి ఎస్‌ఐలు చొరవ చూపాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కొత్తగా విధుల్లో చేరిన ఎస్‌ఐలు ఫిర్యాదు దారుల పట్ల స్నేహపూర్వకంగా మెదలాలని, వారి సమస్యలను నేర్పుగా పరిష్కరించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమావేశంలో బెల్లంపల్లి రూరల్‌, తాండూర్‌ సీఐలు జగదీశ్‌, ఉపేందర్‌, బెల్లంపల్లి వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో రాజు, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సత్సంబంధాలు కలిగి ఉండాలి
నెన్నెల: ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండాలన్న లక్ష్యమే ఫ్రెండ్లీ పోలీస్‌ అని డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. నెన్నెల పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ప్రజలకు, పోలీసులకు సత్సంబంధాలు కలిగి ఉండాలని, మధ్య వర్తిత్వం అనేది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీశ్‌, తాండూర్‌ సీఐ ఉదయ్‌ కుమార్‌, నెన్నెల ఎస్‌ఐ రమాకాంత్‌ ఉన్నారు.

ఫ్రెండ్లీగా వ్యవహరించాలి
భీమిని(కన్నెపల్లి) : పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో క్రైంరేటు వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పెంచిన మొక్కలను చూసి ఎస్‌ఐని అభినందించారు. ఆయన వెంట తాండూర్‌ సీఐ ఉపేందర్‌, కన్నెపల్లి ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి, పోలీసులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...