కోల్‌బెల్ట్‌ ప్రగతికి సహకారం


Wed,November 13, 2019 02:39 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న సింగరేణి వీటితోపాటు సింగరేణి ప్రాంతాభివృద్ధికి తనవంతు సహకారం అందించాలని రాష్ట్ర షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి అధ్యక్షతన కోల్‌బెల్ట్‌ ఏరియా ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో జరిగిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎండీ శ్రీధర్‌ ప్రజాప్రతినిధుల సూచలనపై స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి యాజమాన్యం సీఎం ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ప్రజాప్రతినిధులు తమ హర్షం ప్రకటిస్తూనే మరికొన్ని సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. వైద్య సౌకర్యం పెంపుదల, సమీప గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు మరిన్ని నిధుల కేటాయింపు, మరింత విస్తృతంగా కారుణ్య నియమాల ప్రక్రియ అమలు వంటి సూచనలు చేశారు. సీఎం ఇప్పటికే సింగరేణి ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఇండ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవడం హర్షనీయమనీని, ఇంకా మిగిలి ఉన్న భూములను ప్రభుత్వానికి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ అంశాలతో పాటు సింగరేణి ఇప్పటి వరకు అమలు జరిపిన సంక్షేమ కార్యక్రమాలు సమీప గ్రామాల అభివృద్ధికి చేపట్టిన చర్యలను పీపీటీ ద్వారా డైరెక్టర్‌ పా వివరించారు.

సింగరేణి ప్రాంత జిల్లాల అభివృద్ధికి కేటాయించిన రూ. 2000 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. వీటికి అదనంగా ప్రతీ నియోజక వర్గానికి రూ. 2 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు కూడా కేటాయించాలని ప్రజాప్రతినిధులు చేసిన సూచనపై సీఎండీ శ్రీధర్‌ సానుకూలంగా స్పం దిస్తూ ప్రతిపాదన సమర్పించాలన్నారు. సీఎండీ శ్రీధర్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్బావం తర్వాత సాధించిన వృద్ధిని, అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ విషయాలలో సింగరేణి దేశంలోనే నెంబర్‌ వన్‌లో ఉందని పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో చేపట్టనున్న కొత్త గనులు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ సింగరేణి విస్తరణకు, ప్రగతికి సహకరించాలని కోల్‌బెల్ట్‌ ప్రతినిధులను కోరా రు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, రేగ కాంతారావుతోపాటు ఎంపీ వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌ రావు, కోరకంటి చందర్‌, గండ్ర వెంకట రమణా రెడ్డి, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాలు జీఎంలు, కార్పొరేట్‌లో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...