రేషన్ దందా!


Tue,November 12, 2019 03:45 AM

-కిలో రూపాయికి కొనుగోలు చేస్తూ రూ.25లకు విక్రయం
-అక్రమ రవాణాపై పోలీసుల ప్రత్యేక దృష్టి
-టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న బియ్యం

మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వా రా రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తోంది. కా ర్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బి య్యం అందిస్తున్నది. కొందరు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం తీసుకుని దళారులకు అమ్ముకుంటున్నారు. కిలో బియ్యం రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల స్మగ్లర్లు దళారుల నుంచి కిలోకు రూ.10 నుంచి రూ.15 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని స్మగ్లర్లు ప్యాసింజర్ రైళ్లు, వ్యాన్లు, లారీల ద్వారా ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ.20 నుంచి రూ.25 వర కు అమ్ముకుంటున్నారు. ఒక కిలోకు దాదాపు రూ.25 వరకు సబ్సిడీ భరించి ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తుంటే లబ్ధిదారులు వాటిని అమ్ముకోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంటోంది. రేషన్ బియ్యాన్ని బయటకు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి మంచి ఫలితాలను రాబడుతున్నారు.

బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే మార్గాలు
కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన కొందరు సభ్యులు ముఠాలుగా ఏర్పడి రేషన్ బి య్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారు బియ్యాన్ని అధికారులు, పోలీసుల కళ్లుగప్పి డీసీఎం వ్యాన్లు, ఆటో ట్రాలీలు, లారీలలో గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నదైన పని కావడంతో ప్యాసింజర్ రైళ్లను ఎంచుకుంటున్నారు. రాత్రిపూట మహారాష్ట్ర వైపుకు నడిచే భాగ్యనగర్, అజ్ని(నాగ్‌పూర్), వేకువ జామున నడిచే రామగిరి ప్యాసింజర్ రైళ్లలో బియ్యాన్ని తరలిస్తున్నారు. స్మగ్లర్లు దళారుల నుంచి సేకరించిన బియ్యాన్ని సంచుల్లో మూటగట్టుకుని హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, రాఘవపురం, రవీంద్ర ఖని, మందమర్రి స్టేషన్లకు సమీపంలో దాచి పెడుతున్నారు.

రైలు వచ్చే సమయంలో స్మగ్లర్లకు చెందిన మనుషులు ఒక్కసారిగా ఆ సంచుల మూటలను రైలులోని బాత్‌రూంలలో, చిట్టచివరన ఉన్న బోగీలలో ఎక్కిస్తారు. అలా ఎక్కించిన తరువాత సాధారణ ప్రయాణికుల్లా జనంతో కలిసి ప్రయాణం సాగిస్తారు. తమ గమ్యం రాగానే రైలు నిదానంగా వెళ్తుండగా బస్తాలను కిందకు తోసేస్తారు. అక్కడే వాటిని తీసుకువెళ్లేందుకు మనుషులు సిద్ధంగా ఉంటారు. ప్రతీనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా అధికంగా సాగుతోంది.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...