సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి


Tue,November 12, 2019 03:43 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణంలోని 100 ఫీట్లరోడ్‌లో బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులు మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్నాయని, రోడ్డు నిర్మాణం ఏళ్లుగా సాగుతున్నదని, ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని, ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ పూదరి తిరుపతి, మజీద్, కొమురయ్య అనే వ్యక్తులు కమిషనర్ స్వరూపారాణికి వినతిపత్రం అందించారు. తోళ్లవాగు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారనీ, ఈ విషయంలో తగిన చర్య లు చేపట్టాలని కోరుతూ ఎర్రోళ్ల నరేశ్, ఆకుల రమేశ్, కుమార్, తదితరులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.

జన్నారం : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎంపీడీవో అరుణారాణి స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విజయ్‌కుమార్, కార్యదర్శులు గుర్రం రాము వివిధ శాఖలకు చెందిన అధికారులున్నారు.
దండేపల్లి : దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, వీఆర్‌వోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కారోబార్ల వినతి..కారోబార్లను మల్టీపర్పస్ వర్కర్ నుంచి తొలగించాలని కోరుతూ మండలంలోని కారోబార్లు ఎంపీడీవో శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జీఓ నంబర్ 51తో కారోబార్లను మల్టీపర్పస్ వర్కర్‌గా అన్ని పనులు చేయించాలని ఉన్నదన్నారు. దీని నుంచి మమ్మల్ని మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారోబార్లు శ్రీధర్, శ్రీనివాస్, రమేశ్, రాజన్న, ప్రభాకర్, ప్రశాంత్, తదితరులున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles