ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం


Tue,November 12, 2019 03:43 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలో జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా మైనార్టీ అధికారి శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర భారత తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పనిచేశారని పేర్కొన్నారు. 1947 నుంచి 1958 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యూకేషన్ వంటి అనేక విద్యా సంస్థలను స్థాపించాడని తెలిపా రు.

పౌరులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి కావల్సిన ప్రాథమిక విద్యను పొందడం ప్రతి ఒక్కరి జన్మహక్కు అని మౌలానా పిలుపునిచ్చారని తెలిపారు. అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాల సక్సెస్‌పుల్‌గా నడవడానికి కారణమైన మాజీ ప్రిన్సిపాల్ శంకర్ లింగంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షఫియోద్దీన్, ప్రిన్సిపాల్, మైనార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయం తిని ప్రిన్సిపాల్ శంకర్‌లింగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తక మేళా ఏర్పాటు చేశారు. అనంతరం గురుకుల బాలికలకు బ్యాగులు అందించారు. ఈ కార్యక్రమం లో వెటర్నరీ డాక్టర్ తిరుపతి, ప్రముఖ కవి రచయిత మలయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ షరిష్మా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...