కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం


Tue,November 12, 2019 03:42 AM

కాసిపేట : కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సి మెంట్ కంపెనీ క్రీడా మైదానంలో సోమవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ సహకారంతో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల వేదమంత్రాలతో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు ప్రచార రథంలో తిరుమల నుంచి శ్రీనివాసుడి విగ్రహాలతో పాటు చేరుకున్నారు. ముం దుగా టీటీడీ నుంచి వచ్చిన విగ్రహ మూర్తులకు ప్రత్యేక పూజ లు చేసి శోభాయాత్ర నిర్వహించారు. కల్యాణానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఫిల్మ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, ఓరియంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు పూస్కూరి రామ్మోహన్‌రావు హాజరయ్యారు. ఓసీసీ ప్రెసిడెంట్ శివకాంత్ పాండే కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...