చాంపియన్ ఆదిలాబాద్


Tue,November 12, 2019 03:42 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : రెండు రోజులుగా జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్ 17బాలబాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. రెండో స్థానంలో రంగారెడ్డి జట్టు, మూడో స్థానం లో వరంగల్ జట్టు నిలిచింది. బాలికల ఓవరాల్ చాంపియన్‌గా రంగారెడ్డి జట్టు క్రీడాకారులు, రెం డో స్థానంలో హైదరాబాద్ జట్టు, మూడో స్థానం లో వరంగల్ జట్టు క్రీడాకారులు నిలిచారు. బాలికలకు 32 కేజీల నుంచి 68 కేజీల వరకు 13 వెయిట్ కేటగిరీలలో, బాలురకు 35 నుంచి 78 కేజీల వరకు 13 వెయిట్ కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. పోటీల పరిశీలకుడిగా నిజామాబాద్ జిల్లా ఫిజికల్ డైరెక్టర్ ఈశ్వర్ వ్యవహరించారు. ముగింపు కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, ఇన్‌చార్జి డీఈఓ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్ హాజరై గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందించా రు. ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు సుమారు గా 220మంది వరకు హాజరయ్యారు. జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, హ్యాండ్‌బా ల్ సంఘం కార్యదర్శి కనపర్తి రమేశ్, టీజీ పెటా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సిరంగి గోపాల్, గాజుల శ్రీనివాస్, బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు కే రాంమోహన్‌రావు, బండి రవి, యాకుబ్, సదానందం, సుదర్శన్, అజయ్, శ్రీనివాస్, సంతోశ్ హాజరయ్యారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...