చలి పంజా


Mon,November 11, 2019 02:14 AM

-మూడు రోజుల్లోనే 4 డిగ్రీల తగ్గుదల
-అధిక వర్షాల నేపథ్యంలో చలి కూడా అధికమే అంటున్న నిపుణులు
-జాగ్రత్తలు పాటించాలని చెబుతున్న వైద్యులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజులుగా కని ష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరు గుతోంది. బుధవారం 20.2 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్ర త.. ఆదివారానికి 16.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరు కుంది. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు అధికా రులు వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా పొగమంచు ఆవరించి ఉంటోంది. ఉదయం పూట చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో నాలుగు డిగ్రీలు తగ్గుదల నమోదు కావడం గమనార్హం. వేకువ జామున 3 గంటల నుంచే పొగమంచు కమ్ముతోంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయమే వివిధ పనుల కోసం బయటకు వచ్చే వారు చలి, పొగమంచు కారణంగా ఇండ్ల నుంచి బయట కు రావడం లేదు. నవంబర్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే డిసెంబర్, జనవరి నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వారంలో 4 డిగ్రీలు తగ్గుదల
జిల్లాలో కేవలం వారం రోజుల్లోనే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. గత ఆదివారం 3వ తేదీన కనిష్ట ఉష్ణోగ్రత 20.6 డిగ్రీలు నమోదు కాగా.. ఈ ఆదివారం 16.08 డిగ్రీలకు పడిపోయింది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. రానున్న పది రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పడుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వేకువ జామునే చలి మంటలు వేసుకుంటున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలుగా చేసి చలిమంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. తెల్లవారు జామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు చలితో వారి సమయాన్ని మార్చుకుంటున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు గిరాకీ ఏర్పడింది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...