ఉచిత మెగా వైద్య శిబిరం


Mon,November 11, 2019 02:13 AM

మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడలో గల లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లోని ఏవీస్ దవాఖాన సహకారంతో కాళ్లలో నరాల వాపునకు సంబంధించిన పరీక్షలు జరిపారు. చితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారిని శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏవీస్ దవాఖానకు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పది రోజులుగా బీపీ, సుగర్, కంటి వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీస్ ఆసుపత్రి సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు అశోక్, నాగేందర్, కిషన్, మనోహర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...