ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన


Mon,November 11, 2019 02:13 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : మిషన్ ప్లాస్టిక్ ఫ్రీ మంచిర్యాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ స్వరూపారాణి ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులు, సిబ్బంది, డీఆర్‌డీఏ ఐకేపీ మహిళలు వార్డుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకం స్థానంలో స్టీలు గ్లాసులు వాడాలని కోరడమే కాకుండా అం దుకు సంబంధించిన పోస్టర్లను అంటించారు. మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి మున్సిపాలిటీ ఏరియాలో తిరిగి చెత్త బయట వేసిన దుకాణాదారుడిని మందలించారు. ప్లాస్టిక్ అమ్మినా, కొన్నా, వాడినా జరిమానాలు విధిస్తామని ప్రజలను మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న హాని, మనందరం చేయాల్సిన పనులను వివరించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో బట్ట సంచులను, జూట్ బ్యాగులను వాడాలని కమిషనర్ ప్రజలకు, యజమానులకు అవగాహన కల్పించారు. గోదావరి నది వద్ద ఉన్న అపరిశుభ్రతపై శానిటేషన్ అధికారులు, సిబ్బందిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ శ్రీనివాస్, ఏఈ నర్సింహాస్వామి, టీపీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...