ఆదివాసీల సంక్షేమానికి సహకరిస్తాం


Mon,November 11, 2019 02:12 AM

కాసిపేట : ఆదివాసీల అభివృద్ధికి సహకారం అందిస్తామని ఓరియంట్ సిమెంట్ కంపెనీ గ్రూప్స్ ప్రెసిడెంట్ ఎస్‌కే పాండే పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలం గట్రావ్‌పల్లిలోని సాలేగూడ గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీమ్ 79వ వర్ధంతిని ఆదివాసీలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు డప్పుచప్పుళ్లతో వాయిద్యాల నడుమ నృత్యాలు చేశారు. అనంతరం జెండా ఎగరవేసి భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్‌కే పాండే మాట్లాడుతూ ఓరియంట్‌లో గట్రావ్‌పల్లి పంచాయతీలోని నిరుద్యోగులకు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

కుమ్రం భీం పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆదివాసీలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నేత మడావి అనంతరావు, సర్పంచ్‌లు ఆడె జం గు, పెంద్రం రాజు, పెంద్రం కవిత, సర్‌మేడి మెస్రం మహదు, కుమ్రం జనర్ధాన్, పెంద్రం హన్మంతు, తుడుం దెబ్బ అధ్యక్షుడు కనక రాజు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మ కిషన్, ఏలకవ్య యూత్ అధ్యక్షుడు మడావి వెంకటేశ్వ ర్లు, ఏఓ రాయిసిడం రాము, కుంరం భీమ్ యూత్ అధ్యక్షుడు ఆత్రం జంగు, లింగు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...