దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థలకు పురస్కారాలు


Mon,November 11, 2019 02:12 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, జిల్లా స్థాయిలో దివ్యాంగులు, దివ్యాంగుల హక్కుల సంరక్షణ అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సదరు సంస్థలకు పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన దివ్యాంగులు, ది వ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థ లు, సంఘాలు పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు ఈ నెల 18వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో పురస్కారాల కోసం రాష్ట్ర దివ్యాంగుల డైరెక్టర్‌కు, జిల్లా స్థాయిలో పురస్కారాల కోసం జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ)కి వివరాలు సమర్పించాలని వారు కోరారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...