గెలుపోటములను సమానంగా స్వీకరించాలి


Mon,November 11, 2019 02:12 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్ 17 బాల,బాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ప్రతి విద్యార్థి క్రీడ ల్లో పాల్గొనేలా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యజమాన్యాలు, వ్యాయామ ఉపాధ్యాయు లు ప్రోత్సాహించాలని తెలిపారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉందనీ. క్రీడలను ప్రోత్సాహిస్తున్నామనీ, అందువల్లే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను చూపుతున్నారని పేర్కొన్నారు. తైక్వాండో క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి రాష్ర్టానికి పేరు తేవాలన్నారు.

నిర్వాహకులు జడ్పీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును సన్మానించారు. తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారనీ, మూడు రోజులు పోటీలు జరుగుతాయని పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బుచ్చిరామారావు తెలిపారు. కోటపల్లి వైస్ ప్రెసిడెంట్ వాల శ్రీనివాస్‌రావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రోజివరకుమారి, టీజీ పెటా సంఘం అధ్యక్షుడు సిరంగి గోపాల్, కార్యదర్శి బెల్లం శ్రీనివాస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షు డు రామయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, బాస్కెట్‌బాల్ సం ఘం కార్యదర్శి సుకుమార ఫ్రాన్సిస్, సీనియర్ పీడీ రాంమోహన్‌రావు, బండి రవి, సదానందం, పీఈటీలు నందం శ్రీనివాస్, రాజమల్లు, అజయ్, పున్నం, విఠల్ పాల్గొన్నారు.

16
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...