పాల కేంద్రం నిర్మాణం వేగవంతం చేయాలి


Sun,November 10, 2019 01:04 AM

-ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షెట్టిపేట : పట్టణంలోని పాల కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆదేశించారు. శనివారం పట్టణంలోని స్థానిక ఊత్కూర్‌లో నిర్మిస్తున్న పాలకేంద్రం పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. రూ.8 కోట్లతో నిర్మిస్తున్న ఈ పాలకేంద్రం వందల మంది పాడి రైతుల పాలిట వరంగా నిలుస్తుందన్నారు. పాడి రైతులు తమ పేర్లను పాల కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి పాడి రైతుకు గుర్తింపు కార్డు జారీ చేయడంతో రాబోయే కాలంలో ప్రభుత్వం అందజేస్తున్న పలు రకాల సంక్షేమ పథకాలకు అర్హులవుతారని తెలిపారు.

పాలకేంద్రం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఐబీ విశ్రాంత భవనంలో మున్సిపాలిటీలో చెత్తా చెదారాలను సక్రమంగా డంపుయార్డులో వేయడం లేదని వచ్చిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్తీక మాసా న్ని పురస్కరించుకుని గోదావరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పందులను మున్సిపాలిటీ పరిధిలో లేకుండా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, తదితరులున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles