రహదారుల నిర్మాణానికి కృషి


Sun,November 10, 2019 01:03 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: చెన్నూర్ ని యోజకవర్గంలోని గ్రామాలకు రహదారుల ని ర్మాణాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శనివారం కలిసి ప్రతిపాదనలు అందించారు. నియోజకవర్గంలో 11 రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూ రు చేయాలని కోరారు. భీమారం నుంచి వయా కొత్తపల్లి మీదుగా కిష్టంపేట వరకు (23 కిలో మీటర్లు), ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వయా నా రాయణపూర్ మీదుగా దుగ్నెపల్లి వరకు వంతెనతో సహా (6 కిలో మీటర్లు), ఆర్‌బీ రోడ్డు నుం చి చింతపల్లి వరకు వంతెనతో సహా (4 కిలో మీటర్లు), ఎస్ హెచ్చ్-1 రోడ్డు పులిమడుగు నుంచి వయా బొక్కలగుట్ట మీదుగా ఏసీపీ రోడ్డు మంచిర్యాలవరకు వంతెనతో సహా (8 కిలో మీటర్లు), జిల్లా పరిషత్ రోడ్డు సండ్రోస్‌పల్లి నుంచి వయా శంకర్‌పల్లి మీదుగా మం దమర్రి వరకు వంతెనతో సహా (6 కిలో మీట ర్లు), ఆర్‌అండ్‌బీ రోడ్డు 10బై వయా బీరవెల్లి, నాగపూర్ మీదుగా పొన్నారం వరకు (16 కిలో మీటర్లు), ఎన్‌హెచ్ 63 రసూల్‌పల్లి నుంచి గుడిపెల్లి వరకు (7 కిలో మీటర్లు), మందమర్రి నుంచి ఆవుడం వరకు (15 కిలో మీటర్లు), పీఆర్ రోడ్డు ఆరెపల్లి నుంచి వయా ఎలకేశ్వరం, ఎల్‌బిపేట మీదుగా సుద్దాల వరకు (8 కిలో మీ టర్లు), బూరుగుపల్లి నుంచి వయా దాంపూర్ మీదుగా ధర్మారం వరకు (7 కిలో మీటర్లు), ఆర్‌ఆండ్‌బీ రోడ్డు నుంచి వయా నర్సింగాపూర్ గోత్రాలవాడ మీదుగా గెర్రగూడెం వరకు (3 కిలో మీటర్లు) రోడ్ల నిర్మాణాలకు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదనలను మంత్రి ద యాకర్‌రావుకు అందజేశారు.

ఈ రోడ్ల నిర్మాణాల్లో భాగంగా చెన్నూర్ మండలం సుద్దాల వాగు, చెన్నూర్ మండలం కత్తరశాల వాగు, చెన్నూర్ మండలం అక్కెపల్లి వాగు, మందమ ర్రి మండలం శంకర్‌పల్లి వద్ద పాలవాగుపైన వంతెనల నిర్మాణాలకు ప్రతిపాదనలకు అందజేశారు. పంచాయత్‌రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీయర్ రమేశ్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీయర్ ప్రకాశ్ జాదవ్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీయర్ స్వామిరెడ్డి, అసిస్టెంట్ ఇంజినీయర్ రాజమౌలి సమావేశంలో ఉన్నారు. నిధుల మంజూరుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేసి, వీలైనంత త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇ చ్చారని బాల్క సుమన్ తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...