క్రీడల్లో రాణించాలి


Sun,November 10, 2019 01:03 AM

నెన్నెల: విద్యార్థులు చదువుతో పాటు ఆట ల్లో ముందుండాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. జడ్పీ పాఠశాలలో జిల్లా స్థాయి అండర్-14 బాల బలికల వాలీబాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆటల్లో రాణిస్తే గుర్తింపు ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటల్లో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉంంటారని వారి నైపుణ్యానికి పదును పెడితే దేశానికే గుర్తింపు తెస్తారన్నారు. ఈ సందర్భంగా జతీయ స్థాయి క్రీడల్లో రాణించిన వారిని అభినందించారు. రాబోయే కాలం లో ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ రమాదేవి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రోజి వరకుమారి, సర్పంచ్ తోట సూజాత, ఆత్మ చైర్మన్ రాజు, పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేశ్, ఎంపీటీసీలు తిరుపతి, హరీశ్ గౌడ్, జిల్లా వాలీబాల్ కార్యదర్శి మైలారం శ్రీనివాస్, పేట డిస్ట్రిక్ కార్యదర్శి గాజుల శ్రీనివాస్, యండీ యాకుబ్, బండి రవి, రామ్మోహన్, రాజేశ్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...