సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి


Sat,November 9, 2019 05:21 AM

కాసిపేట: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనీ, గ్రామంలో ప్రధా న కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ రాములు గ్రామస్తులకు సూ చించారు. లంబాడితండా(కె) గ్రామస్తులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలతో నేర పరిశోధన సులభతరమవుతుందన్నారు. గ్రామాల్లో అనుమానితులు వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూ చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజ లు సహకరించాలని కోరారు. అనంతరం జడ్పీ సెకెండరీ పాఠశాలను సందర్శించి వి ద్యార్థులతో మాట్లాడారు. చదువుపై శ్రద్ధ పెడి తే ఉన్నతంగా ఎదుగుతారని సూచించారు. ప్రైమరీ పాఠశాలను సందర్శించిన ఎస్‌ఐతో ఉపాధ్యాయులు మాట్లాడారు. పాఠశాల పరిసరాల్లో తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారనీ, మద్యం సీసాలను బడి ఆవరణలో పగులగొడుతున్నారని వివరించారు. గస్తీని పెంచి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లంబాడితండా(కె) జీపీని పరిశీలించి సర్పంచ్ బానో త్ వినోదను గ్రామంలోని వివరాలడిగి తెలుసుకున్నారు. ఏఎస్‌ఐ శంకరయ్య, బానోత్ రాజేశ్, కార్యదర్శి సురేశ్, జైపాల్ ఉన్నారు.

భీమిని(కన్నెపల్లి): ప్రజలు పోలీసులకు సహకరించాలని కన్నెపల్లి ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి కోరారు. గురువారం రాత్రి కన్నెపల్లి మండలంలోని దాంపూర్, జజ్జరవెల్లి, రెబ్బెన గ్రా మాల్లో పర్యటించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. గ్రామా ల్లో ఘర్షణలకు దిగకుండా శాంత యుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. యువకులు వ్యసనాలకు బానిస కావద్దని, చక్కగా చదువుకొని కలలను నెరవేర్చుకోవాలని సూచించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...