బాలబాలికల సంరక్షణే ధ్యేయం


Fri,November 8, 2019 04:02 AM

-హక్కుల వారోత్సవాల్లో కలెక్టర్ భారతి హోళికేరి
-నేటి నుంచి 18వరకు పలు కార్యక్రమాలు
మంచిర్యాల రూరల్ : బాలబాలికల సంరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమనీ, బాలబాలికల సంరక్షణ, వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమం లో ఆమె పాల్గొని మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో వారం రోజుల పాటు పిల్లల హక్కు లు, చట్టాలు,పోషకాహార అవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8న పాఠశాలలు,బాలల సదనం, బాలల సంరక్షణ గృహాల్లో చిత్రలేఖనం, చర్చావేదిక, వ్యాసరచన, వివిధ రకాల పోటీలు జరుగుతాయని చెప్పా రు. కిశోర్ దివస్,వైద్య శిభిరాల నిర్వాహణ,పోషకాహారణ కార్యక్రమాల పంపిణీ ఉంటుందన్నా రు. 9న చట్టాలపై అవగాహన, 10న గ్రామసభ లు, బాలల సంరక్షణపై పలు ప్రదర్శనలు, 11న విద్యార్థులతో ప్రతిజ్ఞ, సమావేశాలు, ర్యాలీలు, ఆహార ప్రదర్శన లు, 12న బాలల హక్కులు,చట్టాలపై సినిమా ప్రదర్శన, జిల్లా స్థాయి మారథన్ ర్యాలీ, 18న పిల్లలతో నమూనా పార్లమెంట్, హరితహారం, విహారయాత్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ చూపిన బాలలకు బహుమతులను అందిస్తారని పేర్కొన్నారు.

అంత కు ముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకం చేశారు. బాలల సంరక్షణకు సంబంధించిన కరపత్రాలను, గోడ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వైరల్, ఇతరాత్ర వ్యాధుల కారణంగా మృతి చెందుతున్నా అవి డెంగీతో మృత్యువాత పడ్డట్లు కొన్ని పత్రికల్లో వార్త కథనాలు వస్తున్నాయనీ, పూర్తి వివరాలను తెలుసుకొని ప్రచురించాలని సూచించారు. డెంగ్యూవ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపర్చేలా వార్తా కథనాలు ఉండాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో డెంగీ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలన్నారు. నిబంధనలను పాటించని ఎయిమ్స్, శ్రీచైతన్య, ముకేశ్ దవాఖానలపై చర్యలు తీసుకునేందుకు మెడికల్ కౌన్సిల్‌కు సిఫా ర్స్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షే మ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి రౌఫ్‌ఖాన్, డీపీఆర్‌ఓ వై సంపంత్ కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, బాలల సంరక్షణ అధికారి ఆనంద్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...