ముగిసిన గిరిజన గురుకులం వైజ్ఞానిక ప్రదర్శనలు


Thu,November 7, 2019 12:53 AM

ఇచ్చోడ (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శలు బుధవారం ముగిశాయి. చివరి రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఉట్నూర్) ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య విద్యార్థుల ఎగ్జిబిట్లను తిలకించి, ప్రశంసించారు. విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్యతో పాటు సైన్స్ టెక్నాలజీపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరువ లేనిదన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లోని 20 గిరిజన గురుకుల బాలుర, బాలికల కళాశాలలు, పాఠశాలల నుంచి సుమారు 420 మంది విద్యార్థులు తరలివచ్చారు. పాటలు పాడుతూ అలరించారు. విద్యార్థుల ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో ఆర్‌సీవో లక్ష్మయ్య, ఏఆర్‌సీ జోసేఫ్ జాన్, ఏటీడబ్ల్యువో సౌజన్య, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఆయా గిరిజన గురుకులాల కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...