సృజనాత్మకతకు పదును పెట్టాలి..


Thu,November 7, 2019 12:53 AM

లక్షెట్టిపేట : విద్యార్థులు సృజన్మాతకతకు పదు ను పెట్టి అద్భుత ఫలితాలు సాధించాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల డిప్యూటీ సెక్రటరీ సక్రు నాయక్ అన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి సైన్స్ ఫేర్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గురుకులాల్లో అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు ఉచిత విద్యనందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దేశ భవిష్యత్ శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉం దని, ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో గురుకులాలకు తిరుగులేదని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లను తిలకించారు. కార్యక్రమంలో ఆర్‌సీఓ గంగన్న, డీసీవో దామోదర్ రెడ్డి, జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, ప్రిన్సిపాల్ లలితా కుమారి, పీఈటీ మల్లిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...