జాతీయ స్థాయిలో సత్తా చాటాలి


Thu,November 7, 2019 12:52 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జాతీయ స్థాయి సైన్స్ డ్రామా పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటాలని డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన సైన్స్ డ్రామా, జానపద నృత్య పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడారు. సైన్స్‌ను ప్రయోగాలతో నే కాకుండా నాటిక రూపంలో చూపించడం అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు సెక్టోరల్ అధికారులు సఫ్దర్ అలీఖాన్, పద్మజ, న్యాయ నిర్ణేతలుగా కొండ్రు జనార్దన్, గుండేటి యోగేశ్వర్, ఉప్పులేటి నరేశ్, మహేశ్, శాంకరీ, రాజగోపాల్, మంజుల, సుహాసిని, నారాయణరావు పాల్గొన్నారు.విజేతలు వీరే : సైన్స్ డ్రామాలో కోటపల్లి మండలం సిర్సా జడ్పీ ఉన్నత పాఠశాల(ప్రథమ), మంచిర్యాల మిమ్స్ ఉన్నత పాఠశాల(ద్వితీయ). జానపద నృత్యంలో మంచిర్యాల మోడల్ స్కూల్ (ప్రథమ), నస్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ద్వితీయ), కోటపల్లి మండలం నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలిచాయి.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...