తాసిల్దార్ హత్య హేయమైన చర్య


Thu,November 7, 2019 12:52 AM

మంచిర్యాల రూరల్ : అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయా రెడ్డి హత్య హేయమైన చర్య అని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బుధవారం ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరంలో విజయా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. తాసిల్దార్ విజయయా రెడ్డి హత్య ఉదంతాన్ని అధికారులతో పాటు ఐఏఎఎస్ ఆఫీసర్ తెలంగాణ కేంద్ర కమిటీ , ప్రభుత్వం ఖండించినట్లు తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే దానిని సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయని, హత్యకు పాల్పడడం సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్,ఆర్డీఓ సురేష్,జిల్లా మైనార్టీ సేమ శాఖ అధికారిణి శ్యామలాదేవి, జిల్లా ఖజానా అధికారి సరోజ, తాసిల్లార్లు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...