ధైర్యంగా విధుల్లో చేరండి..


Wed,November 6, 2019 01:59 AM

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఆర్టీసీ సమ్మెలో ఉన్న కార్మికులు కార్మిక సంఘాల నాయకులకు, జేఏసీ నాయకులకు భయపడకుండా స్వచ్ఛందంగా విధుల్లో చేరవచ్చునని టీఎస్‌ ఆర్టీసీ మంచిర్యాల డిపో నోడల్‌ ఆఫీసర్‌, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అన్నారు. మంగళ వారం డిపో కార్యాలయంలో ఆయన డిపో మేనేజర్‌ మేకల మల్లేశయ్యతో కలిసి మాట్లాడారు. కొన్ని డిపోలలో కార్మికులు స్వచ్ఛందంగా వచ్చి విధుల్లో చేరుతున్నారని, ప్రభుత్వం ఆ అవకాశం కల్పించిందని, విధుల్లో చేరే వారు ఎవరికి భయపడకుండా విధుల్లో చేరవచ్చన్నారు. ఏదైనా ఇబ్బంది అనుకుంటే డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి (9440795003), ఏసీపీ లక్ష్మీ నారాయణ (9440795040), డీవీఎం రమేష్‌(9959225997), ఆర్టీసీ డీఎం మల్లేశయ్య(9959226004)లను సంప్రదించవచ్చన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరుగుతుండటం సంతోషకరమైన విషయమన్నారు. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు నడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంతో పాటు ఏఎంవీఐ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...