కాంగ్రెస్ నాయకుల విమర్శలు సరికాదు..


Tue,November 5, 2019 12:42 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎరినాగుల మల్లికార్జున్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. విప్ సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. ఒకే రోజు చెన్నూర్‌లో రూ.45 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొదవలగానే కొంతమంది కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న విప్ సుమన్‌ను విమర్శిస్తే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...