తాసిల్దార్ హత్య హేయమైన చర్య


Tue,November 5, 2019 12:42 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ/కోటపల్లి/ భీమారం/ మందమర్రి రూరల్ : అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం హేయమైన చర్య అని టీఎన్‌జీఎస్ చెన్నూర్ యూనిట్ అధ్యక్షుడు పొన్న మల్లయ్య అన్నారు. తాసిల్దార్ హత్యను ఖండిస్తూ టీఎన్‌జీఓఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి మామిడి రాజన్న, నాయకులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.కోటపల్లిలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తాసిల్దార్ మునావర్ షరీఫ్, డిప్యూటీ తాసిల్దార్ కమల్ సింగ్, ఆర్‌ఐ, వీఆర్వోలు, సిబ్బంది ఉన్నారు.భీమారంలో తాసిల్దార్ సుభాషిణి ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ గంగయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహేశ్, సర్వేయర్ సాయి కృష్ణ పాల్గొన్నారు. తాసిల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని మందమర్రి తా సిల్దార్ సునీత డిమాండ్ చేశారు. రెవెన్యూ సిబ్బం ది నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఆర్‌ఐలు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...