గ్రామాల్లో పంట పొలాల పరిశీలన


Tue,November 5, 2019 12:42 AM

కోటపల్లి : మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను ఎంపీపీ మంత్రి సురేఖ, తాసిల్దార్ షరీఫ్, మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, షట్‌పల్లి సర్పంచ్ ముల్కల్ల ఉమ, అధికారులు పరిశీలించారు. మండలంలోని షట్‌పల్లి, కోటపల్లిలో నేలకొరిగిన వరి, పత్తి చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మితో పాటు జిల్లా అధికారుల దృష్టకి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుదన్నారు. మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పంట నష్టం సర్వే చేస్తున్నారని చెప్పారు. నాగంపేట, బొప్పారంలో ఏఈఓ వైష్ణవి, ఆలుగామ, ఆయపల్లి శివార్లలో ఏఈఓ అనూష, కోటపల్లి, షట్‌పల్లిలో ఏఈఓ రాజ్ కుమార్, అన్నారంలో ఏఈఓ శేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుల ఆధ్వర్యంలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ముల్కల్ల శశిపాల్ రెడ్డి, మంత్రి రామయ్య, వేముల రాజం పాల్గొన్నారు.

చెన్నూర్ రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని ఆస్నాద్‌లో దెబ్బతిన్న పంటలను ఏఈవో సాగర్ సోమవారం పరిశీలించారు. మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న వరి పంట విస్తీర్ణాన్ని ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. నేలకు ఒరిగిన వరి గొలుసును నిలబెట్టి జడలా కట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, ఉప సర్పంచ్ నస్కూరి శ్రీనివాస్, నాయకులు నరసింహా చారి, రాజన్న, రవి, రైతులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...