ఉద్యోగులకు రక్షణ కల్పించాలి


Tue,November 5, 2019 12:42 AM

మంచిర్యాల రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని టీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి సురేశ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ హత్య ఘటనపై తెలంగాణ నాన్ గెజిటె డ్ (టీఎన్‌జీఓ) ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. మండల మెజిస్ట్రేట్‌పై పెట్రో ల్ పోసి దహనం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. జిల్లా కార్యదర్శి గడియారం శ్రీహరి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ పతి బాపూరావు, ఉపాధ్యక్షురాలు కేజియారాణి, సంయుక్త కార్యదర్శి సునీత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సత్యనారాయణ, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు సతీశ్, కార్యదర్శి గోపాల్, చెన్నూర్ యూని ట్ అధ్యక్షుడు మల్లయ్య,మందమర్రి యూనిట్ అ ధ్యక్షుడు ప్రభు, కార్యరద్శి పద్మలత ఉన్నారు.

దాడి హేయమైన చర్య
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్‌పై జరిగిన దాడి హే యమైన చర్య అని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రైసా) అధ్యక్షుడు శ్రీనివాస్ రావ్ దేశ్ పాండే అన్నారు. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు నల్ల రిబ్బన్లను ధరించి జిల్లా కలెక్టర్ కార్యాల యం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాసిల్దార్‌ను పెట్రోల్ పోసి నిప్పంటిం చడం హేయమైన చర్య అన్నారు. నిరసనలో జిల్లాలోని తాసిల్దార్లతో పాటు రెవెన్యూ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...