ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి


Tue,November 5, 2019 12:41 AM

శ్రీరాంపూర్: ప్రజా ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. నస్పూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. సీతారాంపల్లి, నస్పూర్, తా ళ్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాస్ పుస్తకాల కోసం, పహని రికార్డు నమోదుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ మోబిన్ అహ్మద్ తో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుం డా చర్యలు తీసుకోవాలనీ, ముఖ్యంగా ప్రజా ఫి ర్యాదు ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.

భీమిని(కన్నెపల్లి): భీమిని తాసిల్దార్ కార్యాల యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, కన్నెపెల్లి తాసిల్దార్ కార్యాలయంలో మండల ప్ర త్యేకాధికారి, డీపీవో వీరబుచ్చయ్య అర్జీలు తీసు కున్నారు. భీమినిలో 7 దరఖాస్తులు రాగా, కన్నెపల్లిలో 6 వచ్చినట్లు తెలిపారు. రాహుల్‌రాజ్ మాట్లాడుతూ అధికారులు రైతులకు జవాబుదారి గా ఉండాలని వారు అధికారులకు సూచించారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కన్నెపల్లిలో తాసిల్దార్ లక్ష్మి, ఎంపీడీవో శంకరమ్మ, అధికారులు పాల్గొన్నారు.
కోటపల్లి: అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ కుమార్ దీపక్ మండల కేంద్రంలోని ప్రజవాణిలో అర్జీలు స్వీకరించారు. షట్‌పల్లిలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎంపీపీ మంత్రి సురేఖ, సర్పంచ్ ముల్కల్ల ఉమ, రైతులు ఆర్జీ సమర్పించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, తాసిల్దార్ మునావర్ షరీఫ్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రవీంద్రనాథ్, మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, పశువైద్యాధికారి పవన్ కుమార్, ఏపీయం రాజన్న, ఏపీఓ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...