ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించాలి


Mon,November 4, 2019 12:36 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్ నిషేధంపై మంచిర్యాల పట్టణవాసులు అందరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బంది ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఆయా వార్డుల్లో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాల గ్రూపు సభ్యులతో కలిసి ప్రజల్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదని, దీని ద్వారా భూమిలోకి నీరు వెళ్లకుండా అడ్డుకుంటుందని తెలిపారు. కాలుష్యం పెరిగి పోతుందని, మానవాళి మనుగడ కష్టమవుతుందని, అనేక వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

ఈ మేరకు మంచిర్యాల పట్టణంలో ఎవరూకూడా ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని సూచించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు అమ్మకానికి ఉంచవద్దని, మున్సిపల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలితే జరిమానా విధిస్తామని సిబ్బంది వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. కమిషనర్ స్వరూపారాణి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు , సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. హమాలివాడలో మహిళలు తాము ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...