కాళేశ్వరంపై మరో మూడు లిఫ్టులు


Thu,October 17, 2019 02:16 AM

-చెన్నూర్‌ను సస్యశ్యామలం చేసే దిశగా విప్ బాల్క సుమన్ కృషి
-నియోజకవర్గంలో 1,31,840 ఎకరాలకు సాగునీరే లక్ష్యం
-త్వరలో సర్వే
-డీపీఆర్ సిద్ధంకాగానే పనులు ప్రారంభం
-ఎమ్మెల్యే చొరవపై ప్రజల్లో ఆనందం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్ జిల్లాకు వరప్రదాయని కానుంది. ఈ ప్రాజెక్టును బహుళార్థక సాధకంగా ఉపయోగించుకునేందుకు నిర్మించగా, ఇప్పుడు చెన్నూర్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో మూడు లిఫ్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందించ నున్నారు. 3 లిఫ్టుల ద్వారా 1,31,840 ఎకరాలకు నీరందించనున్నారు. రీడిజైనింగ్‌కు ముం దు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద 56,500 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రా ణహిత ప్రాజెక్ట్‌కు సంబంధించి అటవీ, అంతర్రా ష్ర్టాల అనుమతులు వచ్చేందుకు చాలా సమ యం పడుతుంది. చెన్నూర్ నియోజకవర్గానికి కాళేశ్వ రం బ్యాక్ వాటర్ ద్వారా నీరందించాలని బాల్క సుమన్ మొదటి నుంచి కోరుతున్నారు. ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమ న్ బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీతో హైదరాబాద్‌లో చర్చించారు.

మూడు లిఫ్టులు.. 1.31 లక్షల ఎకరాలు
మేడిగడ్డ బ్యాక్ వాటర్ ప్రాణహిత మీద మొద టి లిఫ్టు ఏర్పాటు చేయనుంది. కోటపల్లి మండ లం వెంచపల్లి వద్ద 30 మీటర్ల ఎత్తులో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ లిఫ్ట్‌తో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో 23,770 ఎకరాల కొత్త ఆయకట్టు కు నీరందనుండగా, 1330 ఎకరాలకు స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 25,100 ఎకరాలకు లబ్ధి చేకూరనుంది. రెండో లిఫ్ట్ అన్నారం బరాజ్ ఫోర్‌శోర్ వద్ద ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 50 మీటర్ల లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 61,743 ఎకరాలకు నీరందుతుంది. అన్నారం బరాజ్ ఫోర్‌శోర్ నుంచి 50 మీటర్లు నీరు లిఫ్ట్ చేసి చెన్నూర్, కోటపల్లి మండలాల్లో 31,252 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తూ, 30,491 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఇక మూడో లిఫ్ట్ సుందిళ్ల బ్యారేజీ ఫోర్‌శోర్ నుంచి 83 మీటర్ల నీటిని లిఫ్ట్ చేసి బీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో 29,418 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతో పాటు 21,879 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరించనున్నారు.

త్వరలోనే అధికారుల సర్వే
ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుతో పాటు ఇతర సాగునీటి శాఖ అధికారులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సమావేశమయ్యారు. దీనికి సం బంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇప్పటికే ఒక నోట్ తయారు చేసిన బాల్క సుమన్ పూర్తి స్థాయిలో అధికారులకు వివరించారు. దీం తో ఈ లిఫ్టులపై కొద్ది రోజుల్లోనే అధికారులు సర్వే నిర్వహించనున్నారు. అధికారులు సర్వే చేసి పూర్తి స్థాయి నివేదిక తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది..? ఇతర అంశాలను అందులో క్రోడీకరించనున్నారు. డీపీఆర్ సిద్ధం కాగానే టెండర్లు పిలిచి పనులు పూర్తయ్యేలా ప్ర ణాళికలు రూపొందిస్తారు. దీనిని తర్వగా పూర్తి చేయాలనీ, నియోజకవర్గం సస్యశ్యామలం చేయాలని విప్, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. దీంతో అటు అధికారులు కూడా ఆఘమేఘాల మీద ప నులు పూర్తి చేస్తున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...