కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి


Thu,October 17, 2019 02:14 AM

దండేపల్లి(లక్షెట్టిపేట): కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వీ వీరయ్య పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం మిట్లపెల్లి గ్రామ పరిధిలోని ముత్యంపేటలో బుధవారం వెలుగు ఫౌండేష న్ సౌజన్యంతో ఆదర్శ వయోజన విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకు వెళ్లాలనీ, ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉండాలని సూచించారు. కుట్టు శిక్షణను మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్, సర్పంచ్ కోడి రాణి,ఉపసర్పంచ్ ఉమాపతి, పంచాయతీ కార్యదర్శి మాధవి, ఎంఈఓ రవీందర్, వెలుగు ఫౌండేషన్ చైర్మన్ ముడుపు రాంప్రకాశ్, డీఆర్‌పీలు రెడ్డిమల్ల ప్రకాశం, సుందిల్ల రమేశ్, కందుల తిరుపతి, కరుణాకర్, రాజామారుతి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...