రద్దీకి అనుగుణంగా రయ్ రయ్!


Wed,October 16, 2019 02:27 AM

-88.06 శాతం నడిచిన ఆర్టీసీ బస్సులు
-సమ్మె కాలంలోనే అత్యధికం
- 47 బస్సుల్లో టిమ్స్.. 9 బస్సుల్లో టికెట్లు
-ఎక్కడా ఇబ్బంది పడని ప్రయాణికులు
- ఇద్దరు సూపర్‌వైజర్లుగా రెవెన్యూ ఉద్యోగులు
-గాడిన పడుతున్న సంస్థ
- మరో 43 అద్దె బస్సులకు నోటిఫికేషన్
రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో మంగళవారం రద్దీకి అనుగుణంగా బస్సులు రోడ్డెక్కుతున్నాయి. సమ్మె మొదలైనప్పటి నుంచి మంగళవారమే అత్యధికంగా 88.06 శాతం ఆర్టీసీ బస్సులు నడిచాయి. అద్దె బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తుండగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో అందుబాటులో ఉన్న వాహనాలను ఎక్కువగా నడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నుంచి డిపోకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించడంతోపాటు కరీంనగర్ రీజియన్ పరిధిలో మరో 43 అద్దె బస్సులకు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు.
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
కరీంనగర్ రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాలో మంగళవారం బస్సులు మరింతగా పెరిగాయి. సోమవారం 587 బస్సులు నడవగా, మంగళవారం 590 బస్సులు రోడ్డెక్కాయి. కరీంనగర్ జిల్లాలో 101 ఆర్టీసీ, 64 అద్దె, పెద్దపల్లిలో 92 ఆర్టీసీ, 42 అద్దె, జగిత్యాలలో 129 ఆర్టీసీ, 67 అద్దె, సిరిసిల్ల జిల్లాలో 66 ఆర్టీసీ, 29 అద్దె బస్సుల చొప్పున మొత్తం 670 బస్సులు నడవాల్సి ఉండగా, 388 ఆర్టీసీ, 202 అద్దె బస్సులు నడిచాయి. ఇవే కాకుండా మరో 51 కాంట్రాక్టు క్యారియర్ బస్సులు తిరిగాయి. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన సిబ్బందిని సూపర్‌వైజర్లుగా వినియోగించుకున్నారు. టికెట్ల విధానంలో చార్జీలు వసూలు చేసే ప్రయత్నాలు కూడా గాడిన పడుతుండగా, కరీంనగర్-1 డిపోలో 11, మంథనిలో 11, కోరుట్లలో 25 బస్సుల్లో టిమ్స్ ద్వారా టికెట్లు అందించారు. అలాగే హుజూరాబాద్‌లో 8 , మంథనిలో 1 బస్సులో టికెట్ల ద్వారా చార్జీలు తీసుకున్నారు.

* ప్రతి డిపోకు ఒక నోడల్ ఆఫీసర్..
డిపోలను పర్యవేక్షించేందుకు ఇతర శాఖల ద్వారా నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ -1 డిపోకు కరీంనగర్ ఆర్టీఓ ఆనంద్‌కుమార్, కరీంనగర్ -2 డిపోకు జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, హుజూరాబాద్ డిపోకు హుజూరాబాద్ ఆర్డీఓ చెన్నయ్యను నియమించారు. అలాగే జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాల డిపోకు ఆర్టీఓ నరేందర్, కోరుట్లకు జేసీ రాజేశం, మెట్‌పల్లికి సబ్ కలెక్టర్ గౌతం పాత్రను నియమించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని గోదావరిఖనికి పెద్దపల్లి ఆర్టీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, మంథనికి స్థానిక ఆర్టీఓ మెంచె నగేశ్‌ను నియమించారు. అలాగే సిరిసిల్ల జిల్లా పరిధిలోని సిరిసిల్ల డిపోకు స్థానిక తాసిల్దార్ తనుకు అంజన్న, వేములవాడ డిపోకు స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్‌ను నియమించారు. వీరు కాకుండా ఆయా జిల్లాల పరిధిలోని ఒక్కో రూట్‌కు ఒక్కో అధికారిని సూపర్‌వైజర్లుగా నియమించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ జిల్లాల్లో వీరు బాధ్యతలు స్వీకరించారు.
* వంద శాతం నడిపేందుకు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వంద శాతం బస్సులు నడపాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లతో పాటు ప్రతి డిపోకు ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను కూడా నియమించారు. రీజియన్ పరిధిలోని 10 డిపోల్లో ఇప్పటికే ఒక్కో డిపోలో 80 నుంచి 98 శాతం బస్సులు నడుస్తున్నాయి. మంగళవారం వరకు కరీంనగర్‌లో 75, పెద్దపల్లిలో 89.3, జగిత్యాలలో 98.99, సిరిసిల్లలో 92.33 శాతం బస్సులు తిరిగాయి. ఈ మొత్తాన్ని వంద శాతం నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతే కాకుండా అంచెలంచెలుగా ప్రతి బస్సులో టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే డిపో మేనేజర్లకు సహాయకులుగా రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందిని కూడా నియమిస్తున్నారు.
* 43 అద్దె బస్సులకు నోటిఫికేషన్..
కరీంనగర్ రీజియన్ పరిధిలో అద్దె ప్రాతిపదికన నడిపేందుకు 43 బస్సులు అవసరం ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్లలో నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలో 32 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, మరో 11 పల్లె వెలుగు బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆర్‌ఎం పీ జీవన్‌ప్రసాద్ తెలిపారు. వివిధ రూట్లలో నడిపించేందుకు ఉత్సాహంగా ఉన్న బస్సుల యజమానులు కరీంనగర్‌లోని రీజియన్ కార్యాలయంలో ఈ నెల 21 వరకు మధ్యాహ్నం 3 గంటల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో గోదావరిఖని డిపోకు 4, హుజూరాబాద్ డిపోకు 4, జగిత్యాలకు 5, కోరుట్లకు 1, మంథనికి 5, మెట్‌పల్లికి 1, సిరిసిల్లకు 8, వేములవాడకు 4 చొప్పున, పల్లె వెలుగు బస్సులు హుజూరాబాద్‌కు 2, కరీంనగర్-1కు 4, కోరుట్లకు 5 బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలకు tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.
కేవీకేలో నేడు కిసాన్ మేళా
జమ్మికుంట: పట్టణంలోని కృషి విజ్ఞాన కేం ద్రంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహిస్తున్నామనీ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కిసాన్ మేళాలో అగ్రికల్చర్ విద్యార్థులతో వ్యవసాయ ప్రదర్శనలు, పలు అంశాలపై చర్చలు, సాంకేతిక స లహాలు, సూచలను నిపుణులు ఇస్తారని తెలిపారు. కిసాన్ మేళాకు రైతులు పెద్ద సంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా మేళాకు అన్ని ఏర్పా ట్లు చేశామని చెప్పారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రెన్యువల్‌కు సంప్రదించాలి
సుభాష్‌నగర్: 2019-20 విద్యాసంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే 1వ తరగతి నుంచి10 వ తరగతి చదువుతున్న మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులు రెన్యువల్‌కు పాఠశాలల పాత డైస్ కోడ్‌కు కాలం చెల్లిందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పీ పవన్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సం బంధిత విద్యాసంస్థల ఓల్డ్ యూ-డైస్ కోడ్ అండ్ ఇనిస్టిట్యూట్ ఐడీ, న్యూ యూ-డైస్ కోడ్, అండ్ ఇనిస్టిట్యూట్ ఐడీ (ఇనిస్టిట్యూట్ ఐడీ ఈజ్ మ్యాండెటరీ ఫీల్డ్) లు సమర్పించాలన్నారు. పై వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అ ధికారి కార్యాలయంలో సమర్పించాలని సూ చించారు. లేనట్లయితే రెన్యువల్ విద్యార్థినీ, విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం లో సంప్రదించాలని అధికారి పవన్‌కుమార్ సూచించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...