పల్లెలు జిగేల్


Tue,October 15, 2019 02:39 AM

-చాలాచోట్ల కొత్తగా వీధి దీపాలు
-ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ పోల్స్
-ప్రతి గ్రామంలో వదులుగా ఉన్న వైర్ల బిగింపు
-పల్లెపల్లెనా డిఫెక్టివ్ ఏబీ కేబుల్.. డీటీఆర్‌ల ఎర్తింగ్
-సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు
-అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితం
-కరెంట్ బాధలు పోయాయంటున్న గ్రామీణులు

పల్లె ప్రణాళికలో భాగంగా గుర్తించిన విద్యుత్ సమస్యలకు పవర్ వీక్ పరిష్కారం చూపింది. 30 రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధతో సాగిన ఈ పనులతో పల్లెల్లో కొత్త వెలుగు కనిపించింది. పవర్‌వీక్‌లో భాగంగా జిల్లాలోని 421 గ్రామాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించి పరిష్కరించారు. 205 గ్రామాల్లో పనులు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29 కిలోమీటర్ల మేర ఏబీ కేబుల్ వేశారు. మూడో లైనుకు సంబంధించి పలుచోట్ల పోల్స్ వేశారు. 125 పోల్స్‌కు రూఫ్ లైన్ ఉన్న దగ్గర రీ-ఫిల్లింగ్ చేశారు. 541 లీడ్ పోల్స్ వేయాలని గుర్తించారు. అలాగే 446 మిడిల్స్ పోల్స్ సరిచేశారు. 180 ఇనుప పోల్స్, పాడైన పోల్స్ మార్చారు. 144 ట్రాన్‌ఫార్మర్లకు ఎర్తింగ్ చేశారు. 192 మీటర్ల స్ట్రీట్‌లైట్లకు స్విచ్చులు బిగించారు. 39 కిలోమీటర్ల మేర మూడో వైరు, 3 కిలోమీటర్ల మేర 5వ వైరు లాగారు. మిగిలిన పనులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 30రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా పవర్ వీక్‌తో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు తీరడంపై ఊరూరా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా కరెంట్ బాధలు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఇదివరకు ఇంత వెలుతురు లేదు..
భీమారం : మా కాలనీలో ఇదివరకు విద్యుత్ దీపాలు సరిగా వెలగకపోయేది. ఇప్పుడు కొత్త లైన్లు, కరెంట్ పోల్స్ వేయడంతో ఆ సమస్య తీరింది. 30రోజల గ్రామ ప్రణాళికలో భాగంగా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సమస్యలు, అవసరాలపై దృష్టి పెట్టారు. పవర్‌వీక్ పేరుతో మూడో లైన్ పనులు పూర్తిచేశారు. గత ప్రభుత్వాల్లో పలుమార్లు విద్యుత్ దుర్వినియోగం అవుతుందని అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం మేము అడగకముందే పరిష్కరిస్తున్నారు. దీని వల్ల విద్యుత్ ఆదా కావడంతో పాటు విద్యుత్ సమస్య, అధిక లోడ్, విద్యుత్ దీపాలు . దీంతో గ్రామంలో నిరంతరం విద్యుత్ వెలుగులు వెలుగకుంట ఉన్నాయి.
- రామల్ల రాకేశ్, మాదన్నగూడెం

కరెంట్ ప్రమాదాలు ఇగ ఉండయ్..
తాండూర్ : సీఎం కేసీఆర్ సారు చేసిన మంచి పని వల్ల ఇగ ఊళ్లె కరెంటు ప్రమాదాలు ఉండయని భరోసా వచ్చింది. 30రోజుల ప్రణాళికలో ఇటు చెత్త తీసుడు, రోడ్లు మంచిగ జేసుడే కాదు.. కరెంట్ పోళ్లు అన్నీ సక్కగ జేసిన్రు. ఏ వాడల జూసినా స్తంభాలు వంగిపోయి.. తీగలన్నీ ఊగులాడవడుతుండె. వీధి దీపాల కోసం సెపరేట్‌గా కొత్త వైర్లు, త్రీఫేస్ లైన్ ఉన్న చోట 5వ లైన్ వైర్, సింగిల్ లైన్ ఉన్న చోట 3వ లైన్ వైరు, మీటర్‌బాక్స్, ఎంసీబీ ఆన్ ఆఫ్ సిస్టమ్ ఫిక్సింగ్ చేశారు. గిట్ల ఊర్ల ఉన్న సమస్యలన్నింటిని సర్పంచులు, కరెంటోళ్లు కలిసి మంచిగ జేసిన్రు. గిప్పుడు ఎంత గాలివాన వచ్చినా కరెంటు పోతలేదు.
- రాదండి లక్ష్మణ్, చౌటపల్లి

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles