జిల్లా విద్యాధికారిగా వెంకటేశ్వర్లు


Tue,October 15, 2019 02:35 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లా విద్యాధికారిగా ఎస్.వెం కటేశ్వర్లు సోమవారం బాధ్యతలు చేపట్టారు. జగిత్యాల డీఈఓగా, కరీంనగర్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఈయన పదోన్నతిపై జిల్లాకు రెగ్యులర్ డీఈవోగా నియమితులయ్యారు. ఎస్సెస్సీ ఫలితాల్లో జగిత్యాల జిల్లాను మూడేండ్లుగా రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టిన పేరున్నది. 2008లో డిప్యూటీ డీఈవోల నియమకాల్లో ఉద్యోగం సాధించి హైదరబాద్‌లోని పనిచేసి జిల్లా ల విభజన సమయంలో జగిత్యాలకు, ప్రస్తుతం పదోన్నతిపై మంచిర్యాలకు రెగ్యులర్ డీఈవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కలెక్టర్‌ను భారతి హోళికేరిని మర్యాద పూర్వకంగా కలిశారు. డీఈవో కార్యాలయ సిబ్బంది ఏడీ పాణిని, సెక్టోరల్ అధికారులు సప్దార్ అలీఖాన్, పద్మజ, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తదితరులు డీఈవోను శాలువాతో సన్మానించారు. అలా గే పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, హన్మాం డ్లు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్దన్‌రావు ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...