విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం


Tue,October 15, 2019 02:34 AM

దండేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం దండేపల్లి మండల కేం ద్రంలోని పీహెచ్‌సీలో రూ.12 లక్షలతో అదనపు గది, ఆరో గ్య కేంద్రం మరమ్మతు పనులు, రూ.35 లక్షలతో కస్తూరిబా విద్యాలయంలో చేపట్టనున్న అదనపు తరగతి గదులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభు త్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం, సదుపాయాలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం లో సకల సౌకర్యాలతో గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు.

కేజీబీవీలను మరింత బలోపేతం చేసి బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటపల్కుల గురువయ్య, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్‌కుమార్, స్థానిక సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ భూమన్న, పీఏసీఎస్ చైర్మన్ రవి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేశ్, స్థానిక వైద్యులు సునీల్, టీఆర్‌ఎస్ నాయకులు ముత్తె రాజమల్లయ్య, బండారి మల్లేశ్, రేని శ్రీనివాస్, కొట్టె సత్తన్న, శంకరరావు, గోళ్ల రాజమల్లు, మంద రాజయ్య,గడిపెల్లి సత్యం, అల్లం సంతోష్, నలిమెల మహేశ్, అఫ్సర్, బొమ్మెన మహేశ్, మగ్గిడి శ్రీనివాస్, సురేందర్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...