సమస్యల పరిష్కారానికి కృషి


Tue,October 15, 2019 02:34 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. శ్రీశ్రీ నగర్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేదని, మురుగు నీరు ఇండ్ల ముందే నిలిచి దుర్వాసన వస్తుందని, వర్షం పడితే ఇళ్లకు వెళ్లే మట్టిరోడ్డు చిత్తడిగా మారి నడవలేని పరిస్థితి ఉందని అంబిలపు శ్రీనివాస్, రామస్వామి, శ్యామ్‌రెడ్డి తెలిపారు. తనకు కార్మెల్ హైస్కూల్ ముందర ఉన్న స్థలంలో కొందరు ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారనీ, వాటిని కూల్చివేయాలని స య్యద్ ఫిరోజ్ అహ్మద్ దరఖాస్తు సమర్పించాడు.

తమకు చెందిన సర్వేనెంబర్ 120/1లో ఆరు గుంటల భూమిని 2014లో కొన్నామని ప్రస్తుతం ఈ స్థలంలో శేషుబాబు అనే వ్యక్తి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నాడని, వెంటనే ఆ నిర్మాణాలను ఆపి తమకు న్యాయం జరిగేలా చూడాలని గోదావరి ఖనికి చెందిన పత్తపాక తిరుపతి, సతీ శ్ విన్నవించారు.
దండేపల్లి : దండేపల్లి తాసిల్దార్ కార్యాలయంలో అర్జీలను మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్ స్వీకరించారు. సమస్యలుంటే అర్జీలిచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిరణ్మయి, ఆర్‌ఐ గణపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.సీసీసీ నస్పూర్ : నస్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. రేషన్‌కార్డులు, భూ సమస్యలపై ప్రత్యేకాధికారి శ్యామలాదేవి, తాసిల్దార్ ముబీన్ అహ్మద్‌కు అర్జీలిచ్చారు. వీటిని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సులోచనదేవి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles