శుభ ఘడియల కోసం..


Mon,October 14, 2019 02:32 AM

-16వ తేదీతో దరఖాస్తుల సమర్పణకు ముగియనున్న గడువు
-జిల్లా సరిహద్దు మద్యం దుకాణాలపై అందరి చూపు
-69 దుకాణాలకు 45 దరఖాస్తుల దాఖలు
మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 9 నుంచి టెండర్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజు రెండు, రెండవ రోజు రెండు, మూడవ రోజు 17, నాల్గవ రోజు 24 కలిపి ఇప్పటివరకు 45 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 26 దుకాణాలకు 24 దరఖాస్తులు, లక్షెట్టిపేట పరిధిలో 11 దుకాణాలకు 13, బెల్లంపల్లిలోని 24 దుకాణాలకు ఆరు, చెన్నూర్ పరిధిలో ఎనిమిది దుకాణాలకు రెండు దాఖలయ్యాయి. శుభఘడి యల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఈ నెల 14, 16 తేదీల్లో దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు గత ఏడాది కూడా చివరి రెండు రోజుల్లోనే అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి.

గతేడాది కంటే ఎక్కువే..
అయితే 2017, సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 19వరకు దరఖాస్తులు పిలువగా మొదటి రోజు, రెండవ రోజు ఒక్క దరఖాస్తు రాకపోగా మూడవ రోజు కేవలం ఆరు దరఖాస్తులు వచ్చాయి. అవి కేవలం మంచిర్యాల ఎక్సైజ్ పరిధిలోనివే. ఇక నాల్గవ రోజున 15 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా ఇందులో మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పది, బెల్లంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒకటి, లక్షెట్టిపేట పరిధిలో ఒకటి, చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువగా దాఖలయ్యాయి.

పౌర్ణమి తర్వాత పెరిగే అవకాశం..
నోటిఫికేషన్ వచ్చిన తొలిరోజు నుంచి చాలామంది వ్యాపారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జాతకాలను సరిపోల్చుకొనే పనిలో పడ్డారు. ఇంట్లో ఎవరి పేర బాగుంది, ఎవరికి కలిసొస్తుందో జా తకాలు చెప్పించుకుంటున్నారు. కొందరైతే ప్రత్యే కంగా పూజలే చేస్తుండడం విశేషం. దరఖాస్తులను స్వీకరించిన వారంతా దేవుడి చిత్రప టాల ముందు ఉంచి తీసుకువచ్చి కలిసి వచ్చే సమ యంలోనే దాఖలు చేస్తుండడం విశేషం. పౌర్ణమి అనంతరం ఈ నెల 14వ తేదిన పాడ్యమి, రేవతి నక్షత్రం కావడంతో భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 16న కూడా మంచి రోజే ఉండడం, పైగా దరఖాస్తులు చివరి రోజు కావడంతో దరఖాస్తులు పోటెత్తనున్నా యి. ఆదివారం పౌర్ణమి మంచి రోజే అయినప్పటికీ సెలవు దినం కావడంతో దరఖాస్తుల సమర్పణకు అవకాశం లేకుండా పోయింది.

సరిహద్దు వైన్స్‌పై అందరి దృష్టి
జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను దక్కించుకు నేందుకు ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచే కాక పక్క జిల్లాలకు చెందిన వ్యాపారులు సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ సారి జిల్లా కేంద్రంలోని దుకా ణాలతో పాటు సరిహద్దు వైన్ షాపులకు భారీ డి మాండ్ ఏర్పడనుంది. జిల్లా సరిహద్దులో ఉన్న కో టపల్లి వైన్ షాపునకు గతంలో అత్యధికంగా 55 దరఖాస్తులు రాగా ఇందులో 41 దరఖాస్తులు చివరి రోజే దాఖలయ్యాయి. ఈ ఏడాది రూడా ఈ దుకాణానికి అంతకన్నా ఎక్కువ రానున్నాయి.

మిగిలింది మూడు రోజులే..
మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఇక మూడు రోజులే మిగిలి ఉండటంతో ఆసక్తి గల వారంతా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మంచి ము హూర్తులుండడంతో వారికి కలిసి వస్తుందని పోటా పోటీగా దాఖలు చేసే అవకాశాలున్నాయి. గతంలో సైతం ఈ 69 దుకాణాలకు 822 దరఖాస్తులు రాగా వీటిలో చివరి రెండు రోజుల్లోనే వరుసగా 225, 567 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది నుంచి ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేసి లైసెన్స్ ఫీజును రెండు సంవత్సరాలకు సంబంధించి ఆరు విడతలకు బదులుగా ఎనిమిది విడతలకు పెంచడం వల్ల వ్యాపారులు ఉత్సాహంగా దరఖాస్తు లు చేసేందుకు ముందుకొస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...