ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి


Mon,October 14, 2019 02:30 AM

మంచిర్యాల రూరల్ : జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో ఆదివారం మంచిర్యాల మహిళా తరంగిణి (మమత) ఆధ్వర్వం లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మమత అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంపై కలిగే అనర్థాలు, నష్టాలను ప్రజలకు వివరించారు. అనంతరం బట్ట సంచులు, పేపర్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జ్యోత్స్న చంద్రదత్, వనజ, సత్యసుధ పాల్గొన్నారు.

మంచిర్యాల అగ్రికల్చర్ : పట్టణంలోని హైటెక్ సిటీ లో లయన్స్ క్లబ్ హైటెక్‌సిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్లాస్టిక్ వాడవద్దని కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. క్లాత్ సంచుల వల్ల ఉపయోగాలు వివరించారు. అనంతరం కాలనీలో బట్ట సంచులు అందజేశారు. అలాగే ఉచిత షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్‌లు జరిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రమేశ్ కుమార్, భూమారావు, దేవేందర్, కిషన్ రావు, రాజేశ్, దివాకర్, హరి మోహన్, మల్లా రెడ్డి, బాలరాజ్, రాజ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...