ఘనంగా వాల్మీకి జయంతి


Mon,October 14, 2019 02:30 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: వాల్మీకి జయంతి వేడుకలను చెన్నూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఎంపీపీ మంతి బాపు వాల్మీకి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేశం, రామకృష్ణ పాల్గొన్నారు.
మందమర్రి : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆర్.భుజంగరావు, సిబ్బంది ఆర్.లక్ష్మీకాంతారావు, మెప్మా టీఎంసీ శ్రీధర్, బీ.శ్యాంబాబు, రవీందర్ పాల్గొన్నారు.

మందమర్రి రూరల్ : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మందమర్రి మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుర్రం మంగ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు నజీరో ద్దిన్, ఏపీఓ రజియా సుల్తానా, టీఏ రాజన్న, ఎఫ్‌ఏ ఈద లింగ య్య పాల్గొన్నారు. చిర్రకుంటలో సర్పంచ్ కొమురయ్య వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

జైపూర్ : జైపూర్ మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల్లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీటీసీ లింగస్వామి, నాయకులు లక్ష్మణ్, తిరుపతి, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ పోచయ్య పాల్గొన్నారు.
భీమారం : భీమారం హన్మాన్ మందిరం ఆవరణలో వాల్మీకి జయంతిని వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఎస్‌ఐ కిరణ్ కుమార్, జడ్పీటీసీ బూక్య తిరుమల, సర్పంచ్ గద్దెరాంరెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఖాజీపల్లి సర్పంచ్ దాడి తిరుపతి, వాల్మీకి సంఘం సభ్యులు బోగే శ్రీనివాస్, విశాల్ ,నాయకులు బూక్య లక్ష్మణ్, గుడిమల్ల వెంకన్న, పెద్దల బాపు, మహిళలు రాజేశ్వరి, తిరుమల పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...