తొమ్మిదో రోజూ సాఫీగా


Mon,October 14, 2019 02:29 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగా ణ: ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి ఆది వారానికి తొమ్మిది రోజులు గడుస్తుంది. ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నా రు. మంచిర్యాల డిపో పరిధిలో 38 ఆర్టీసీ బస్సులు, 50 హైర్ విత్, 18 ప్రైవేటు బస్సు లు, 60 క్యాబ్ లు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. ఇవే కాకుండా 40 నుంచి 60 వరకు ఆటోలు, టాటా ఏస్ ట్రాలీలు నడుస్తున్నాయి. ఆర్టీసీ డిపోకు బదిలీపై వచ్చిన రెవెన్యూ సిబ్బంది షిప్టులు వారీ గా విధులు నిర్వహిస్తున్నారు.

టోకెన్ ప్రకారం..
ఆర్టీసీ బస్సులతో పాటు హైర్‌విత్ బస్సు లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆర్టీ సీ, ఆర్టీఓ అధికారులు బస్సులకు టోకెన్లు ఇచ్చి పంపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న ప్లాట్ ఫారం మీద ఒక ఏరియాకు వెళ్లే బస్సు సీట్లు నిండగానే ఆ బస్సును ప్లాట్ ఫారం నుంచి పంపి ఆ స్థానంలో మరో బ స్సును అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేట్, హైర్‌విత్ బస్సులు ఎక్కువగా వస్తుండడంతో ఆర్టీసీ బస్సులను తగ్గిస్తున్నారు. మరోవైపు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పాటు పోలీసులు పిలిచి మరీ ప్రయాణికుల ను బస్సుల్లో ఎక్కిస్తున్నారు. దీంతో బస్టాండ్‌కు వస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగడం లేదు.

భారీగా బందోబస్తు
ఆర్టీసీ డిపో, బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ కా ర్మికుల సమ్మె కారణంగా కార్మికులు బస్టాండ్‌లోకి వచ్చి ఏవైనా ఆందోళన కార్యక్రమా లు చేపడుతారోనని ముందు జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ డీసీపీ రవి కుమార్ ఆధ్వర్యం లో ఏసీపీ గౌస్‌బాబా, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు భారీ బందోబస్తు నిర్వహించా రు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు సహాయ సహకారా లు అందిస్తున్నారు. మరోవైపు మరమ్మతుకు గురైన సీసీ కెమెరాల స్థానంలో కొత్తవి, బస్టాండ్‌లోకి వచ్చే మార్గం, వెలుపలకు వెళ్లే మార్గాల్లో, ప్రధాన ముఖ ద్వారం వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...