నక్సలైట్ల పేరుతో బెదిరింపులు


Sat,October 12, 2019 01:00 AM

జైపూర్: తుపాకీతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ముగ్గురు నకిలీ నక్సలైట్లను జైపూర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈమేరకు జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్ల డించారు. కోటపల్లి మండలం మంగినపల్లి గ్రామానికి చెందిన బొమ్మ చంద్రశేఖర్‌రెడ్డి, వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి, చెన్నూర్ పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన తోడె రాజేశ్వర్‌రెడ్డి జాల్సాలకు అటవాటుపడి డబ్బు న్న వారి సమాచారం సేకరించి మోసాలకు తెగబడే వారు. ఈ ముగ్గురు పాత పరిచయస్తులే గాక సమీప బంధువులు కూడా. ఇందులో నవీన్‌రెడ్డి బీహార్ రాష్ట్రంలోని పాట్నా ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేయగా మిగతా ఇద్దరు హైదరాబాద్‌లోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు.

జల్సాలకు అలవాటు పడి వసూళ్లు, దొంగతనాలకు చేయాలనే దుర్బుద్ధితో నవీన్‌రెడ్డి మరోసారి పాట్నా వెళ్లి రూ.40వేలకు తుపాకీ తెచ్చుకున్నాడు. ముందుగా సేకరించిన జాబితా ప్రకారం నర్వ సర్పంచ్‌కు ఫోన్ చేసి నక్సల్ ప్లీనరీ సమావేశాలకు రూ.5లక్షలు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. సర్పంచ్‌తో పాటుగా మంచిర్యాల, హజీపూర్ ప్రాంతాల్లో కొం తమందిని డబ్బులు డిమాండ్ చేయగా నర్వ సర్పంచ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనల ప్రకారం.. వారికి డబ్బులు ఇస్తామనే నమ్మకం కలిగేలా చేసి హైదరాబాద్ నుంచి వారిని మంచిర్యాలకు రప్పించారు. అప్పటికే మాటు వేసి ఉన్న జైపూర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇందారం క్రాస్‌రోడ్డ సమీపంలో వారిని పట్టుకున్నారు. వారి నుంచి తుపాకీ, తొమ్మిది బుల్లెట్లు, మూడు సెల్‌ఫోన్లు, డిస్కవరీ మోటార్‌సైకిల్(ఏపీ 01ఏబీ 4598) స్వాధీనం చేసుకున్నారు.

బెదిరింపులకు భయపడవద్దు
మావోయిస్టులు, నక్సలైట్లు మరే ఇతర పేర్లతో భ యపెట్టే వారికి భయపడాల్సిన పని లేదని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సీపీ తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. నేరాలకు పా ల్పడే వారిపై ఖఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ నక్సల్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిని సకాలంలో గుర్తించి పట్టుకున్న పోలీస్ అధికారులను అభినందించారు. సమావేశం లో ఏసీపీ వెంకట్‌రెడ్డి, శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, టాస్క్‌ఫోర్స్ సీఐలు కుమార్‌స్వామి, ఎస్‌ఐ గంగరాజగౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...