మూడవ రోజు 17 టెండర్లు


Sat,October 12, 2019 12:57 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలో మద్యం దుకాణాలకు మూడవ రోజైన శుక్ర వారం 17 దరఖాస్తులు వచ్చాయి. 2019, నవంబర్ ఒకటో తేది నుంచి 2021, అక్టోబర్ 31వ తేది వరకు మద్యం దుకాణాల నిర్వహణకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఈ నెల తొమ్మిదో తేది నుంచి సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదటి రోజున రెండు దరఖాస్తులు రాగా, రెండవ రోజు సైతం రెండు దరఖాస్తులే వచ్చాయి. కాగా శుక్ర వారం నాటికి జిల్లాలో మొత్తం 21 దరఖాస్తులు దాఖలయ్యాయి. మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 26 దుకాణాలు, లక్షెట్టిపేట పరిధిలో 11, బెల్లంపల్లిలోని 24, చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎనిమిది దుకాణాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 69 దుకాణాలకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 21 దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ రెండవ శనివారం సైతం టెండర్లు తీసుకుంటున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉండడం, ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేయడంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నా యి. ముఖ్యంగా లైసెన్స్ ఫీజును ఇది వరకు వ్యాపారులు రెండు సంవత్సరాలకు సంబంధించి ఆరు విడతలలో చెల్లించే వారు. దానిని ఎనిమిది విడతలకు పెంచడం వల్ల పోటాపోటీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...