ఉల్లాసంగా..ఉత్సాహంగా..


Sat,October 12, 2019 12:57 AM

లక్షెట్టిపేట : అమ్మనాన్నల హల్‌చల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు లక్షెట్టిపేటలోని ప్రభుత్వ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల శుక్రవారం ఆటల పోటీలు, పాటలు, వ్యాసరచన, వక్తృత్వ, డిబేట్, చదరంగం, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, టెన్ని కాయిట్, మ్యూజికల్ చైర్స్, పరుగుపందెం, బెస్ ్టకపుల్ పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్, సావిత్రీబాయి చిత్రపటాలకు ప్రిన్సిపాల్ ఎమ్ లలితాకుమారి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీజీపీఏ సభ్యులు, పీడీ మల్లిక, పీఈటీ మమత, వైస్ ప్రిన్సిపాల్ రమ, సిబ్బంది, తదితరులున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...