ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి


Sat,October 12, 2019 12:56 AM

జన్నారం : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ గ్రామస్తులకు తిమ్మాపూర్ సర్పంచ్ 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రా మంలో 380 ఇళ్ల యజమానులకు రూ 52,080వేల విలువైన 760 తడి, పొడి బుట్టలను సర్పంచ్ జాడి గంగాధర్ పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి ఇంటి యజమానులు ఇండ్లలోని చెత్తను రోడ్లపైన వేయద్దన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని సూచించారు. చెత్తను రోడ్లపైన వేసిన వారికి రూ. 5 వందల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు వెంకట్, కార్యదర్శి లావణ్య గ్రామ ప్రజలున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...