మత్స్యకారుల ఉపాధికి కృషి


Sat,October 12, 2019 12:56 AM

-సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి
-మత్స్య శాఖ జిల్లా ఏడీ సత్యనారాయణ
-ర్యాలీ వాగు ప్రాజెక్టులో 4.40 లక్షల చేప పిల్లలు విడుదల
మంచిర్యా రూరల్ : మత్స్యకారుల ఉపాధి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మత్స్యశాఖ జిల్లా ఏడీ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామ శివారులో ఉన్న ర్యాలీ వాగు ప్రాజెక్టులో 4 లక్షల 40 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఏడీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపదను పెంచేందుకు, మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చేపల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నదని తెలిపారు. ఈ చేపల పెంపకంతో మత్స్యకారుల ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ర్యాలీ వాగు ప్రాజెక్టులో చేపల పెంపకంతో స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల శ్రీనివాస్, ముల్కల్ల మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవీందర్, కార్యరద్శి బాలరాజు, ఫీల్డ్ మెన్ రామ్‌ధన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ కమిటీ కార్యదర్శ్శి కిరిటీ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...