ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలి


Thu,September 19, 2019 11:57 PM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపా లని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ను హైదరాబాద్‌లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యు డు వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు కలిసి వినతిపత్రం అందించారు. మంచిర్యాల పట్టణంలో రోజురోజుకీ జనాభా పెరిగిపోతుందనీ, చుట్టుపక్కల పట్టణాల్లో నివసిం చే ప్రజలు విద్య, వైద్యం, వ్యా పారం కోసం ఇక్కడికే వస్తుంటారని వివరించారు. ఇక్కడ దేశంలోని పలు ముఖ్య పట్టణాలకు వెళ్లే రైళ్లను నిలిపితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నా రు. సికింద్రాబాద్-బికనీర్ (బికనీ ర్), త్రివేంద్రం-న్యూఢిల్లీ(కేరళ), విశాఖపట్టణం - న్యూఢిల్లీ (ఏసీ ఏసీ ఎక్స్‌ప్రెస్), చెన్నై-జోధ్‌పూర్ (జోధ్‌పూర్), విశాఖపట్టణం-గాంధీ ధాం (గాంధీధాం) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో నిలపాలని వారు కోరారు. దీంతోపాటే కరీంనగర్ - తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కాగజ్‌నగర్ వరకు పొడగించాలని కోరారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై టికెట్ ఇష్యూయింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలనీ, రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్నప్రజల కోసం హైటెక్ కాలనీ సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని వారు జీఎంను కోరారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...