ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలి


Tue,September 17, 2019 03:02 AM

టవర్‌సర్కిల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ భగీరథ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ తాగునీటి కనెక్షన్లపై మిషన్ భగీరథ ఏఈలు, విద్యాశాఖాధికారులు, ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థిని, విద్యార్థులకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు భగీరథ పైపులైన్ల నుంచి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తం 673 పాఠశాలలకుగానూ ఇప్పటి వరకు 444 పాఠశాలలకు భగీరథ కనెక్షన్లు ఇచ్చారనీ, మిగితా వాటికి వచ్చే నెల 15 లోపు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా పాఠశాలలకు భగీరథ పైపులైన్లు దూరంగా ఉంటే ఆ గ్రామ సర్పంచ్ సహకారం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజినీర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...